
OpenAI చాట్‌బాట్ ChatGPT లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ఇప్పుడు WhatsApp లో కూడా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ గతంలో ChatGPT వెబ్ ,మొబైల్ యాప్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది.
ChatGPT ఇమేజ్ జనరేషన్ ఇప్పుడు WhatsApp లో 1-800-ChatGPT ద్వారా అందుబాటులో ఉంది. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. అంటూ సోషల్ మీడియా X లో పోస్ట్‌లో కంపెనీ తెలిపింది.
"మీ ChatGPT ఖాతాను WhatsAppలోని 1-800-ChatGPTకి లింక్ చేయడం ద్వారా మరిన్ని ఇమేజ్ జనరేషన్‌లు పొందవచ్చు. గత డిసెంబర్‌లో కంపెనీ తన ప్రసిద్ధ చాట్‌బాట్‌ను WhatsApp ద్వారా యాక్సెస్ కు అనుమతించింది. 1-800-ChatGPT అని పిలువబడే ఈ ప్రయోగాత్మక సర్వీస్ ఖాతా లేదా యాప్ అవసరాన్ని తొలగించడం లేకుండా ChatGPTని మరింత యాక్సెస్ పొందేలా యూజర్లకు అనుమతిస్తోంది.
ఫొటోలను సృష్టించేందుకు WhatsAppలో ChatGPTని ఎలా ఉపయోగించాలి..
- మీ ఫోన్ కాంటాక్ట్‌లకు 1-800-ChatGPT అధికారిక నంబర్ +1-800-242-8478 సేవ్ చేయాలి.
- తర్వాత WhatsApp ఓపెన్ చేసి ఆ నంబర్‌కు “హాయ్” అని మేసేజ్ పంపాలి.
- అప్పుడు మీ OpenAI ఖాతాను ధృవీకరించమని మిమ్మల్ని అడుగుతుంది. లాగిన్ అవ్వడానికి లింక్‌ను ఫాలో అవ్వాలి.
- లింక్ చేయబడిన తర్వాత ఇక ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ ను కంటెంట్ ఇవ్వడం ద్వారా సృష్టించుకోవచ్చు.
ఉదాహరణకు “హిమాలయాలపై ఎగురుతున్న డ్రాగన్” అని గానీ “బంతితో ఆడుతున్న కుక్క” వంటి ప్రాంప్టులను పంపించి ఇమేజ్ పొందవచ్చు. ChatGPT దాని DALL-E మోడల్‌ను ఉపయోగించి AI-జనరేటెడ్ ఫొటోలను అందిస్తుంది. ఇమేజ్ జనరేషన్ వేగంగా అందించడం అనేది ChatGPT అత్యంత ప్రజాదరణ పొందిన లక్షణాలలో ఒకటిగా మారింది.