Health alert: ఈ అలవాట్లు ఉన్నాయా!మానుకోండి..అవి కిడ్నీ క్యాన్సర్ కు దారితీయొచ్చు

Health alert: ఈ అలవాట్లు ఉన్నాయా!మానుకోండి..అవి కిడ్నీ క్యాన్సర్ కు దారితీయొచ్చు

‘‘హెల్త్ ఈజ్ వెల్త్’’ అంటుంటారు నిజమే.. ఆరోగ్యంగా ఉంటే అదే సంపద..హోదా, ఆనందం ఇలా అన్నింటిని తెచ్చిపెడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకునే ఆహారం, బిజీలైఫ్, ముఖ్యంగా అలవాట్లు  ఆరోగ్యాన్ని  బాగా దెబ్బతీస్తున్నాయి. చిన్న వయసులోనే ఆర్గాన్స్ చెడిపోవడం, సీరియస్ హెల్త్ ఇష్యూస్ తో కొందరు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, లివర్ వంటి శరీరంలో ప్రధాన భాగాలు చెడిపోయి  ఆస్పత్రుల పాలై కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో ఓ కీలకమైన ఆర్గాన్ కిడ్నీలు..ఇవి కొన్ని రకాల చెడు అలవాట్లతో ప్రమాదంలో పడుతున్నాయి. చాలా మంది కిడ్నీ క్యాన్సర్ బారినపడుతున్నారు. కిడ్నీ క్యాన్సర్ కు ముఖ్యంగా రోజువారీ అలవాట్లే ప్రధాన కారణం అంటున్నారు డాక్టర్లు.. అవేంటో చూద్దాం.. 

మూత్రపిండాల క్యాన్సర్ తరచుగా దాని ప్రారంభ దశలో లక్షణాలు ఏమీ కనిపించవు. భారతదేశంలో ముఖ్యమైన ఆరోగ్య సమస్యల్లో ఇదొకటి. మూత్రంలో నిరంతరం రక్తం, నొప్పి వంటివి కనిపిస్తే మూత్రపిండాల క్యాన్సర్ కు సంకేతాలుగా కనిపిస్తున్నా.. ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా కిడ్నీక్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని తెలుస్తోంది. అయితే పెద్ద ప్రశ్న ఏమిటంటే కిడ్నీ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ?దీనికి సమాధానం చాలా వరకు దైనందిన అలవాట్లలోనే ఉందంటున్నారు నిపుణులు.

కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రోజువారీ అలవాట్లు:

పొగతాగడం..పొగతాగడం అనేది కిడ్నీ క్యాన్సర్‌కు అత్యంత ప్రమాద కారకాల్లో ఒకటి. ఇది మూత్రపిండాలలోని రక్త నాళాలను దెబ్బతీస్తుంది. కణితి ఏర్పడే అవకాశాలను పెంచుతుంది.

ఊబకాయం, సరైన ఆహారం లేకపోవడం

అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారం ,ఎర్ర మాంసం ,చక్కెర పానీయాలు అధికంగా ఉన్న ఆహారం కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం మూత్రపిండాలకు రక్షణగా ఉంటుంది.

కెమికల్స్ వల్ల.. 

ట్రైక్లోరోఎథిలీన్ (లోహ శుభ్రపరచడం,డ్రై క్లీనింగ్‌లో ఉపయోగిస్తారు) వంటి కొన్ని కెమికల్స్ వల్ల మూత్రపిండాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సరైన భద్రత పరికరాలను ఉపయోగించడం ద్వారాకిడ్నీ క్యాన్సర్ ను అరికట్టవచ్చు. 

అధిక ప్రోటీన్ సప్లిమెంట్లు వాడకం.. 

ముఖ్యంగా అధిక ప్రోటీన్లు గల సప్లిమెంట్లు వాడినా, ఫిట్ నెస్ ట్రెండ్స్ కూడా కిడ్నీలపై అధిక ప్రభావాన్ని చూపుతాయంటున్నారు నిపుణులు. దీర్ఘకాలిక నష్టంతోపాటు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు. 

హెల్త్ చెకప్ నిర్లక్ష్యంతో.. 

క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ ఉంటే మూత్ర పిండాల సమస్యల పెరగొచ్చు. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుంటే ఉదాహరణకు స్కానింగ్ సమయంలో ప్రారంభ దశ మూత్రపిండ క్యాన్సర్లు యాదృచ్ఛికంగా బయటపడే ఛాన్స్ ఉంది. 

మూలికల వాడకంతో..

ఏదైనా అనారోగ్యం అనిపించినప్పుడు చాలా మంది ఇచ్చిన సలహాలతో కొందరు మూలికలు వాడుతుంటారు. అవి మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. ఆ మందులలో భారీ లోహాలుంటాయి. ఇవి మూత్రపిండాలలోపేరుకుపోయి ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. 

లక్షణాలు లేకపోయినా అల్ట్రాసౌండ్ లేదా CT స్కాన్‌లలో కనిపించే మూత్రపిండాల సంబంధిత ఫలితాలను విస్మరించవద్దని నిపుణులు గట్టిగా సలహా ఇస్తున్నారు. యూరాలజిస్ట్‌తో సకాలంలో సంప్రదించాలంటున్నారు. నెఫ్రాన్-స్పేరింగ్ సర్జరీతో క్యాన్సర్‌ను అరికట్టవచ్చంటున్నారు. 

ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తున్నప్పుడు కిడ్నీ క్యాన్సర్ తరుచుగా కనిపించే హెల్త్ ప్రాబ్లమ్ అని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇది ధూమపానం మానేయడం, బాగా తినడం, చురుకుగా ఉండటం ,క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పనిగా ఉంచుకోవచ్చు.