ఒడిశా నుంచి కేరళకు గంజాయి ట్రాన్స్ పోర్ట్..ముగ్గురు అరెస్ట్.. 50 కిలోల సరుకు స్వాధీనం

ఒడిశా నుంచి కేరళకు గంజాయి ట్రాన్స్ పోర్ట్..ముగ్గురు అరెస్ట్.. 50 కిలోల సరుకు స్వాధీనం

భద్రాచలం, వెలుగు : ఒడిశాలోని మల్కన్​గిరి నుంచి 50.04 కిలోల ఎండు గంజాయిని కారులో కేరళలోని తిరువనంతపురానికి తరలిస్తుండగా భద్రాద్రి పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎన్​ఫోర్స్​మెంట్​ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన ప్రకారం.. కేరళకు చెందిన అక్షయ్​సురేశ్, కుంజుమన్​ సురేంద్రన్ మినిమోల్, అనంత కృష్ణన్ కారులో ఎండు గంజాయిని తరలిస్తున్నారు. భద్రాచలం- పరిధి కూనవరం రోడ్డులో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి లభించింది. ముగ్గురు నుంచి కారు, 4 సెల్​ఫోన్లు, రూ.17 వేల నగదు, రూ.28.70 లక్షల విలువైన 50.4 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భద్రాచలం ఎక్సైజ్ పోలీస్​స్టేషన్ లో అప్పగించినట్లు ఎక్సైజ్ ఎస్ఐ తెలిపారు.