షర్మిల తెలంగాణ సంపదపై కన్నేశారు.. 

షర్మిల తెలంగాణ సంపదపై కన్నేశారు.. 

తెలంగాణ రాష్ట్రంలోని సంపదపై కన్నేసిన షర్మిల.. రకరకాల పార్టీల పేరుతో జనంలోకి వస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్. అలాంటి వాళ్లను నమ్మి ఓట్లు వేస్తే.. ఇబ్బంది పడతారంటూ హెచ్చరించారు మంత్రి. అలాంటి నాయకులను నమ్మినా.. ఆ పార్టీలకు ఓట్లేసినా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు.

షర్మిలకు ఓటేస్తే.. సింగరేణి బొగ్గును రాజమండ్రికి తీసుకుపోతారని.. అప్పుడు మనం ఏమి చేయలేమన్నారు. షర్మిల లాంటి వారికి తెలంగాణలో ఏం పని ప్రశ్నించారు మంత్రి గంగుల. ఆమెకు తెలంగాణ ఆచార వ్యవహారాల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు మంత్రి  గంగుల. 

షర్మిల రాష్ట్రంలో పాదయాత్రలు చేయడం చూస్తుంటే.. గతంలో తెలంగాణ సంపదను దోచుకున్న వారి చరిత్ర, తీరు మార్చుకోలేదని నిరూపితమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర సంపదపై కన్నేసిన ఆమె.. తెలంగాణలో విషబీజాలు నాటేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. షర్మిలకు తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు.