ఆత్మ గౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా ‘గరివిడి లక్ష్మి’

ఆత్మ గౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా ‘గరివిడి లక్ష్మి’

హీరోయిన్ ఆనంది ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. గౌరీ నాయుడు జమ్ము దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌గా ఈ చిత్రం నుంచి ఆనంది ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రివీల్ చేసిన టీమ్.. బోనాలు సందర్భంగా ఆదివారం  గ్లింప్స్‌‌ను రిలీజ్ చేశారు.  ఇందులో  ఊరి స్టేజీలు, జనం కేరింతలు, ఫోక్ ఐకాన్‌‌గా నిలిచిన గరివిడి లక్ష్మి ఎంట్రీతో గ్లింప్స్ ఆకట్టుకుంది.

లక్ష్మిగా ఆనందీ పెర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేస్తోంది. 15 ఏళ్లలో పదివేల స్టేజీలను తాకిన గాయని జీవితాన్ని రీక్రియేట్ చేసింది ఆనంది. చరణ్ అర్జున్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు  ఆ విజువల్స్‌‌ని మరింత ఎలివేట్ చేసింది. ‘గరివిడి లక్ష్మి’ మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా అని దర్శక నిర్మాతలు చెప్పారు. నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.