కస్తూర్భా కళాశాలలో గ్యాస్ లీక్.. విద్యార్థినులకు అస్వస్థత

కస్తూర్భా కళాశాలలో గ్యాస్ లీక్.. విద్యార్థినులకు అస్వస్థత

సికింద్రాబాద్ మారేడ్ పల్లి కస్తూర్భా కాలేజీలో గ్యాస్ లీకై పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు. ఘాటు వాసన కారణంగా కొందరు స్పృహ తప్పి పడిపోయారు. గ్యాస్ పీల్చడంతో 8 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం విద్యార్థినులను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. 

గ్యాస్ ప్రభావంతో విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. విషయం తెలిసిన విద్యార్థునుల తల్లిదండ్రులు హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. తమ బిడ్డల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గ్యాస్ లీక్ కు కారణాలు అన్వేషిస్తున్నారు.