విదేశీ లీగ్లలో భారత దేశ కోచ్లకు ప్రాధాన్యం ఇవ్వరు  :గౌతమ్ గంభీర్

 విదేశీ లీగ్లలో భారత దేశ కోచ్లకు ప్రాధాన్యం ఇవ్వరు  :గౌతమ్ గంభీర్

ఐపీఎల్ వల్లే భారత క్రికెటర్లు ఐసీసీ టోర్నీల్లో రాణించలేకపోతున్నారన్న వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఖండించారు. ఐసీసీ టోర్నీల్లో విఫలమైతే టీమిండియా ప్లేయర్లను విమర్శించవచ్చని.. కానీ ఐపీఎల్పై ఆరోపణలు సరికావన్నారు. ఐపీఎల్ భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చివేసిందని చెప్పుకొచ్చాడు. అలాంటి ఐపీఎల్పై ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. FICCI, ప్రధాన క్రీడల విభాగం ఛైర్‌పర్సన్‌ సన్‌జోగ్‌ గుప్తా చేతుల మీదుగా గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ఐపీఎల్తో మేలు..

ఐపీఎల్తోనే క్రికెట్కు మేలు జరిగిందని గంభీర్ తెలిపారు. ఎంతో మంది ప్లేయర్ల ప్రతిభ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి దీనిపై అనేక వివాదాలు వస్తూనే ఉన్నాయని..అయితే ప్లేయర్లు ఆడకపోతే ఐపీఎల్పై నిందలు వేయడం సరికాదన్నాడు. ఐపీఎల్ వల్ల ప్లేయర్లకు ఆర్థిక భరోసా దొరికిందని చెప్పాడు. ఐపీఎల్ ద్వారా పొందే ఆదాయం కింది స్థాయి ఆటగాడి అభివృద్ధికి తోడ్పడిందని వివరించాడు. 

కోచ్లకు ప్రాధాన్యం..

భారత్ జట్టులో ప్రస్తుతం ఇండియా కోచ్లకే బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తుండటం మంచిపరిణామమని గంభీర్ అన్నాడు. భారత జట్టుకు కోచ్గా భారతీయుడే ఉండాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నానన్నాడు. ఐపీఎల్లో అన్ని జట్లకు భారతీయ కోచ్లే ఉండాలని అనుకున్నట్లు చెప్పాడు. కానీ మనదేశంలో విదేశీ కోచ్లకే ప్రాధాన్యం ఇస్తారని..వారు డబ్బు సంపాదించుకోవడానికే వస్తారన్నాడు. విదేశీ లీగ్లలో మాత్రం భారత దేశ కోచ్లకు ప్రాధాన్యం ఇవ్వరన్నాడు.