కోచ్ కాకముందు ఒక మాట.. అయ్యాక ఒక మాట.. గంభీర్ దమ్ముంటే రాజీనామా చేయాలి: మాజీ ప్లేయర్

కోచ్ కాకముందు ఒక మాట.. అయ్యాక ఒక మాట.. గంభీర్ దమ్ముంటే రాజీనామా చేయాలి: మాజీ ప్లేయర్

టీమిండియా కోచ్ గంభీర్  నాటకాలు ఆడటంలో ఆయనకు ఆయనే సాటి అని విమర్శించాడు ఇండియా మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ. ఇండియా ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఆడటంపై సంచలన కామెంట్స్ చేశాడు. దమ్ముంటే గంభీర్ రాజీనామా చేసి.. కోచ్ కాకముందు ఏం మాట్లాడాడో దానిపై నిలబడాలని డిమాండ్ చేశాడు. సోమవారం (ఆగస్టు 25) గంభీర్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ తో ఆడుతుండటంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రకాల వాదనలు, విమర్శలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఇండియా-పాక్ మధ్య పొలిటికల్ టెన్షన్స్ నడుస్తున్న వేళ.. మరి కొన్ని రోజుల్లో ఆసియా కప్ లో రెండు దేశాలు తలపడుతున్నాయి. ఆసియా కప్ కు ముందు మనోజ్ తివారి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.  

గంభీర్ నాటకాలు ఆడటంలో దిట్ట. అతడు మంచి హిపోక్రాట్. ఇండియా పాకిస్తాన్ తో ఆడకూడదని కోచ్ కాకముందు గంభీర్ కామెంట్స్ చేశాడు. అప్పుడు వద్దన్న వ్యక్తి.. ఇప్పుడు ఎలా సమర్ధిస్తున్నాడు.. అంటూ ప్రశ్నించాడు తివారీ. దమ్ముంటే గంభీర్ మాట మీద నిలబడాలి. వెంటనే హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయాలి. మొదటి నుంచి మాట్లాడిన మాటపై నిలబడాలి.. అని ఛాలెంజ్ విసిరాడు. 

2025 ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత గంభీర్ ఇరు దేశాల క్రికెట్ మ్యాచ్ లపై కామెంట్ చేశాడు. ఇండియా పాక్ ఆడాలా వద్దా అన్న ప్రశ్నకు.. తన ఒపీనియన్ ప్రకారం ఇండియా పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడకూడదని అప్పట్లో వ్యాఖ్యలు చేశాడు గంభీర్. అయితే ఇప్పుడు గంభీర్ కోచ్ గా ఉన్న టైం లోనే ఇరు దేశాలు తలపడుతుండటంపై మనోజ్ తివారీ ప్రశ్నల వర్షం కురిపించాడు. 

అంతకు ముందు మాజీ కెప్టెన్ ధోనీపై కూడా విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. 2011లో తొలి వన్డే సెంచరీ చేసినప్పటికీ కెప్టెన్ ధోనీ తనను భారత జట్టులో నుంచి తొలగించాడని మనోజ్ తివారీ పలుమార్లు చెప్పుకొచ్చాడు. భారత జట్టు నుండి ధోని తనను తొలగించకపోతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా అత్యుత్తమ బ్యాటర్‌గా తాను అయ్యేవాడని గతంలో తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2012లో ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్, కోహ్లి, సురేశ్ రైనా పరుగులేమీ చేయలేదని గుర్తు చేశాడు. తాజాగా మనోజ్ తివారీ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ధోనీని మరోసారి టార్గెట్ చేశాడు.