ఎన్‌‌‌‌పీపీ తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్గా గవ్వల భరత్ కుమార్

ఎన్‌‌‌‌పీపీ తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్గా గవ్వల భరత్ కుమార్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నేషనల్‌‌‌‌ పీపుల్స్‌‌‌‌ పార్టీ (ఎన్‌‌‌‌పీపీ) తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్​గా గవ్వల భరత్​కుమార్​ నియమితులయ్యారు. ఎన్ పీపీ జాతీయ అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్‌‌‌‌ కె. సంగ్మా భరత్‌‌‌‌ కుమార్‌‌‌‌ను నియమించగా, వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ జేమ్స్‌‌‌‌ సంగ్మా  నియామక పత్రం అందజేశారు. గతంలో భరత్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఎన్‌‌‌‌పీపీ జాతీయ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 

ప్రస్తుతం తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా భరత్‌‌‌‌ కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రాజకీయ అవకాశాలు కల్పించి, పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామని చెప్పారు. గిరిజనులకు 100 శాతం అక్షరాస్యత, నిరుద్యోగ సమస్యపై రాజీలేని పోరాటం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అతి త్వరలోనే ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. పార్టీ ప్రతినిధులు, రెండు రాష్ట్రాల ముఖ్యనేతలు భరత్‌‌‌‌ కుమార్‌‌‌‌ను అభినందించారు.