కొత్త మ్యాప్ : గాజాను రెండుగా విడగొట్టిన ఇజ్రాయెల్

కొత్త మ్యాప్ : గాజాను రెండుగా విడగొట్టిన ఇజ్రాయెల్

నవంబర్ 5న సాయంత్రం గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు విస్తరించడంతో, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సైనికులు గాజా నగరాన్ని చుట్టుముట్టారని, యుద్ధం తర్వాత మూడోసారి టెలికమ్యూనికేషన్ సేవలు నిలిపివేశారు. దీంతో గాజా నగరాన్ని రెండుగా విభజించినట్లు అధికారులు చెప్పారు.
 
జ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభం అయి నెలరోజులు పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 5నకాల్పుల విరమణ కోసం అంతర్జాతీయంగా వచ్చిన అభ్యర్థనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరాన్ని చుట్టుముట్టాయి. ఇక లెబనాన్‌లో సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ఇరాక్ దేశంలో ఆకస్మికంగా పర్యటించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి బ్లింకెన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడికి పాల్పడింది. దీంతో గాజాను రెండు రెండు భాగాలుగా విభజించామని రియర్ అడ్మ్ డేనియల్ హగారి తెలిపారు. ఇజ్రాయెల్ మీడియా 48 గంటల్లో గాజా నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది.