నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా(డీఆర్‌వో) బి.గీతను ప్రభుత్వం నియమించింది. మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్డీవో హోదాలో సోషల్ వెల్ఫేర్ రెనిడెన్షియల్ సొసైటీలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న ఆమెకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేశారు. 2020 ఫిబ్రవరికి ముందు జిల్లాలో డీఆర్వోల నియామకం జరిగింది.
గత బీఆర్‌ఎస్ గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ పోస్టులను తొలగించి అడిషనల్ కలెక్టర్ పదవులను క్రియేట్ చేసింది. అప్పటి నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలోని డీఆర్వోల నియామకాలు చేపట్టలేదు. సరిగ్గా ఆరేండ్ల తరువాత జిల్లా రెవెన్యూ ఆఫీసర్ పోస్టును భర్తీ చేశారు. బోధన్ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి వికాస్ మహతో ట్రాన్స్‌ఫర్‌తో ఖాళీ అయిన స్థానంలో ఆర్డీవోగా ఎం.విజయకుమారిని
నియమించారు.
