భయపెడుతున్న గీతాంజలి2 టీజర్

భయపెడుతున్న గీతాంజలి2 టీజర్

హోమ్లీ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం  గీతాంజలి మళ్లీ వచ్చింది.  తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్.  హైద‌రాబాద్‌లోని ఓ క‌న్వెన్షన్ హాల్‌లో శ‌నివారం సాయంత్రం టీజ‌ర్ లాంచ్ చేశారు. అంజ‌లి క్లాసిక‌ల్ డ్యాన్స్‌తో మొద‌లైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

ఓ పాడుబడిపోయిన బంగ్లాలోకి షూటింగ్ కోసం వెళ్లిన వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. అసలు ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది ఫన్నీ అండ్ హర్రర్ గా తెరకెక్కి్ంచారు.ఈ చిత్రానికి శివ తూర్లపాటి దర్శకత్వం వహిస్తు్ండగా..  కొన వెంకట్ నిర్మిస్తున్నారు.  

శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రులు పోషిస్తున్నారు. 2024 మార్చి 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.  అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం.  ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.