తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది బ్యూటిఫుల్ హీరోయిన్ జెనీలియా. అయితే పెళ్లయిన తర్వాత సినిమాలకి పూర్తీగా దూరమైంది. ఈ క్రమంలో తన కుటుంబ బాధ్యతలు చక్కబెట్టే పనిలో పడింది. అయితే జెనీలియా తన భర్తతో జరిగిన ఓ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
ఓసారి రితీష్ దేశ్ ముఖ్ ఇక మనిద్దరి లవ్ కి బ్రేకప్ అని అర్థరాత్రి మెసేజ్ చేశాడట. దీంతో అప్పటివరకూ అంతా మంచిగా సాగుతున్న సమయంలో ఇలా బ్రేకప్ అని మెసేజ్ రావడంతో చాలా కంగారు పడ్డానని చెప్పుకొచ్చింది. దీంతో మరుసటి రోజున ఈ విషయం గురించి రితీష్ ని అడిగితే సింపుల్ గా ఏప్రిల్ ఫస్ట్ కావడంతో ప్రాంక్ చేసానని చెప్పడంతో మనసు కుదుట పడిందని తెలిపింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి లైఫ్ మీద ఇలాంటి ప్రాంక్ చెయ్యద్దని తన భర్త రితీష్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సరదాగా చెప్పుకొచ్చింది.
అయితే రితీష్ మరియు జెనీలియా 2012లో ఫిబ్రవరి 3న ఇరువురి పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రితీష్ ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో జెనీలియా ఇంటిపట్టునే ఉంటూ పిల్లలని, కుటుంబాన్ని చూసుకుంటోంది.