
పద్మారావునగర్, వెలుగు : గాంధీ మెడికల్ కాలేజీ వైరాలజీ ల్యాబ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ లేదని రిపోర్టు వచ్చిందని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఈనెల 20 నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 48 శాంపిల్స్ టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చిందన్నారు. టెస్ట్ రిపోర్టులు, శాంపిల్స్‌ను పుణె సెంట్రల్ వైరాలజీ ల్యాబ్‌కు పంపి చెక్ చేసుకుంటా మని, ఇకపై రిపోర్టులను తామే చెప్తామన్నారు. గాంధీలో చికిత్స పొందుతున్న ఒమిక్రాన్ అనుమానితుడు, సోమాలియా దేశస్తుడికి (66) గురువారం నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. ఈనెల 18న గాంధీలో చేరిన బాధితుడి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీడీఎఫ్‌డీకి పంపించారు.