రీబాక్‌‌‌‌‌‌‌‌ను అమ్మకానికి పెట్టిన కంపెనీ

రీబాక్‌‌‌‌‌‌‌‌ను అమ్మకానికి పెట్టిన కంపెనీ
న్యూఢిల్లీ: జర్మన్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌వేర్ కంపెనీ అడిడాస్‌‌‌‌‌‌‌‌ తమ సబ్సిడరీ కంపెనీ రీబాక్‌‌‌‌‌‌‌‌ను అమ్మేయాలని చూస్తోంది. దీనికి గల అవకాశాల గురించి ఉద్యోగులతో కంపెనీ చర్చిస్తోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. కరోనా సంక్షోభంతో ఇండియాలో రీబాక్ స్టోర్లను అడిడాస్‌‌‌‌‌‌‌‌ చాలా వరకు క్లోజ్‌‌‌‌‌‌‌‌చేసింది. కంపెనీ రెవెన్యూ పడిపోయింది. 2005 లో రీబాక్‌‌‌‌‌‌‌‌ను 3.8 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు అడిడాస్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసింది. ఈ సబ్సిడరీ కంపెనీని కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు ఆసక్తి చూపించొచ్చని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రీబాక్‌‌‌‌‌‌‌‌ కోసం స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్‌‌‌‌‌‌‌‌ను వెతుకుతున్నామని అడిడాస్ స్పోక్స్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని, కంపెనీ కొత్త స్ట్రాటజీలో భాగంగా రీబాక్‌‌‌‌‌‌‌‌ను అడిడాస్‌‌‌‌‌‌‌‌ కొనసాగించొచ్చని అన్నారు. వచ్చే మార్చిలో ఈ కొత్త స్ట్రాటజీని ప్రకటిస్తామని చెప్పారు. ఈ ప్రకటనపై ఉద్యోగుల ప్రశ్నలకు జవాబిస్తున్నామని పేర్కొన్నారు.