వర్క్‌‌స్ట్రెస్​ను ఇట్ల తీసేయండి

వర్క్‌‌స్ట్రెస్​ను ఇట్ల తీసేయండి

ఏడాది నుంచి వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్‌‌ నడుస్తోంది. తెరుచుకున్న కొన్ని ఆఫీసులు కూడా కరోనా సెకండ్‌‌ వేవ్‌‌‌‌ కారణంగా మళ్లీ వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్‌‌ ఇచ్చాయి. దీంతో చాలా ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ ఇంటి నుంచే పనిచేసుకుంటున్నారు. నిజానికి ఆఫీస్‌‌కు వెళ్లి పనిచేసే దానికంటే వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్‌‌ చేయడమే కష్టం. వర్క్‌‌ బర్డెన్‌‌తో చాలామంది విసిగిపోతున్నారు. అలాంటప్పుడు మీ పార్ట్‌‌నర్‌‌‌‌కు మోటివేషన్‌‌ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇంట్లో పనిచేసి బోర్‌‌‌‌ కొట్టిన పార్ట్‌‌నర్‌‌‌‌కు పనిలో హెల్ప్‌‌ చేయడం లాంటివి చేస్తే బర్డెన్‌‌ తగ్గుతుంది. 
  నచ్చిన ఫుడ్‌‌ చూసినప్పుడు మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌ వర్క్‌‌ బర్డెన్‌‌గా ఫీలైనప్పుడు వాళ్లకు నచ్చిన ఫుడ్‌‌ ఏదైనా వండిపెట్టాలి. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్న వాళ్లకు డిఫరెంట్‌‌గా బాల్కనీలో డిన్నర్‌‌‌‌ లాంటిది అరేంజ్‌‌ చేస్తే బాగుంటుంది. ఆడవాళ్లకు వర్క్‌‌ బర్డెన్‌‌ అనిపించినప్పుడు మగవాళ్లు వాళ్లకు నచ్చిన ఫుడ్‌‌ వండిపెట్టి, ఇంట్లో పనులు షేర్‌‌‌‌ చేసుకుంటే బర్డెన్‌‌ తగ్గుతుంది. 
  ఒకేచోట కూర్చుని వర్క్‌‌ చేస్తుండటం వల్ల బోర్‌‌‌‌ ఫీలయ్యి చిరాకు పడతారు. అలాంటప్పుడు ఇంట్లోని వేరే గదిలో వర్క్‌‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలి. కంప్యూటర్‌‌‌‌ టేబుల్‌‌ను అందంగా తీర్చిదిద్దితే రిఫ్రెషింగ్‌‌గా ఉంటుంది. ఇండోర్‌‌‌‌ ప్లాంట్స్‌‌, కొత్త స్టేషనరీ వస్తువులతో వర్క్‌‌ప్లేస్‌‌ను మేకోవర్ చేయాలి. 
  ఇద్దరూ కలిసి వాకింగ్‌‌, రన్నింగ్‌‌ లాంటివి చేస్తే రిలీఫ్‌‌గా అనిపిస్తుంది. వర్క్‌‌లోడ్‌‌ ఎక్కువనిపిస్తే వర్క్‌‌ పూర్తయ్యాక బయటికి వెళ్తే హాయిగా ఉంటుంది. కానీ, ఆ టైంలో కచ్చితంగా కరోనా గైడ్‌‌లైన్స్‌‌ పాటించాలి.