
సుప్రీం కోర్టు సీరియస్
కటకటాల ఉండాల్సిన వ్యక్తి బయట ఉన్నాడు
రూల్ ఆఫ్ లా పాటిం చండి.. యూపీ సర్కారుకు ఆదేశం
న్యూఢిల్లీ/కాన్పూర్: 60కిపైగా కేసులున్న వికాస్ దుబే లాంటి వ్యక్తి బెయిల్ పొందడమంటే వ్యవస్థలు ఫెయిల్ అవ్వడమేనని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రూల్ ఆఫ్ లా పాటించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ‘‘కటకటాల వెనకాల ఉండాల్సిన వ్యక్తి బెయిల్ పొందాడు. ఇది కచ్చితంగా ఇన్ స్టిట్యూషన్ వైఫల్యమే. ఇన్ని కేసులున్న దుబే లాంటి వ్యక్తి బెయిల్ పొందాడని తెలిసి మేం భయపడిపోయాం ’’ అని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ల బెంచ్ చెప్పింది. దుబే, అతడి అనుచరుల ఎన్ కౌంటర్లపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిం ది. గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వుల మేరకు దుబేకు సంబంధించిన కేసులపై ఈనెల 22లోపు రిపోర్టు ఇవ్వాలని యూపీ సర్కారును ఆదేశించింది.
బురద చల్లడం ఆపండి
గ్యాం గ్ స్టర్ దుబే, అతడి అనుచరుల ఎన్ కౌంటర్లపై విచారణ జరిపేందుకు హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ (రిటైర్డ్) శశి కాంత్ అగర్వాల్ తో సింగిల్ మెంబర్ కమిటీ ఏర్పాటు చేశామని బెంచ్ కు యూపీ సర్కారు తెలిపింది. దీంతో విచారణ కమిటీలో సుప్రీం కోర్టు మాజీ జడ్జి, రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ కూడా ఉండేలా చూడాలని కోర్టు సూచించింది. సుప్రీం సిట్టింగ్ జడ్జిని ఎంక్వైరీ కమిటీలో నియమిం చలేమని చెప్పింది. ఈ సందర్భంగా ఓ పిటిషనర్ స్పం దిస్తూ.. ఎంక్వైరీ కమిటీ మెంబర్లను నియమిం చే అధికారాన్ని యూపీ ప్రభుత్వానికి ఇవ్వొద్దని కోరారు. దీంతో సీరియస్ అయిన కోర్టు.. ’’అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ జడ్జిలు రాష్ర్ట ప్రభుత్వం స్పాన్సర్ చేసిన వాళ్లని మీరు అంటున్నారా? బురద చల్లడం ఆపండి. ఈ బుద్ధిని ప్రతి ఒక్కరు మానుకోవాలి’’ అని ఘాటు కామెంట్స్ చేసింది.
మరో ఇద్దరు అరెస్టు
వికాస్ దుబే కీలక అనుచరుడు జై బాజ్ పేయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరిని కూడా
సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
బ్లీడింగ్ వల్లే చనిపోయాడు..
దుబే పోస్టుమార్టం రిపోర్టును పోలీసులు పబ్లిక్ డొమైన్ లో ఉంచారు. బుల్లెట్ గాయాలతో రక్తం ఎక్కువగా పోవడం వల్లే చనిపోయినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. అతడి శరీరంపై 10 గాయాలయ్యాయని, ఒక బుల్లెట్ కుడి భుజానికి, రెం డు బుల్లెట్లు ఛాతీ ఎడమవైపు చొచ్చుకువెళ్లాయని రిపోర్టులో వివరించారు.