ఎమోషనల్‌‌ టచ్‌‌తో ఘంటసాల

ఎమోషనల్‌‌ టచ్‌‌తో ఘంటసాల

లెజెండరీ సింగర్  ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన  బయోపిక్  ‘ఘంటసాల ది గ్రేట్’.  సింగర్  కృష్ణ చైతన్య టైటిల్ రోల్ చేశాడు.  ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటించారు. సిహెచ్ రామారావు దర్శకత్వంలో సిహెచ్ శ్రీమతి ఫణి నిర్మించారు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది. శనివారం టీజర్‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన  దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ ‘ఘంటసాల  స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌‌గా ఉంటుంది. 

ఈ జనరేషన్‌‌తో సహా ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలి’ అని కోరారు.  కృష్ణ చైతన్య మాట్లాడుతూ ‘ఘంటసాల గారి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నా.  ఆయన పాటలు వింటూ పెరిగిన నేను  ఆయన జీవిత చరిత్రను చెప్పే క్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పాడు. దర్శకుడు రామారావు మాట్లాడుతూ ‘సింగర్‌‌గా కంటే ఘంటసాల  వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియాలనే ఈ సినిమా తీశా.  ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు’ అని అన్నారు.  నిర్మాతలు  రామ సత్యనారాయణ,  శోభా రాణి  పాల్గొన్నారు.