Ghattamaneni Debue: మహేష్ బాబు ఫ్యామిలీ వారసుడి ఎంట్రీకి సర్వం సిద్ధం.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ అన్నీ ఫిక్స్!

Ghattamaneni Debue: మహేష్ బాబు ఫ్యామిలీ వారసుడి ఎంట్రీకి సర్వం సిద్ధం.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ అన్నీ ఫిక్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుండి మరొక హీరో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మాట చాలా కాలం నుండి వినిపిస్తోన్నప్పటికీ.. ఇప్పుడు వినిపించే దాంట్లో మాత్రం నిజముందంటున్నాయి సినీ వర్గాలు. మరి ఘట్టమననేని ఫ్యామిలీ నుంచి రానున్న ఆ నటవారసుడు ఎవరు? ఎవరి డైరెక్షన్లో రానున్నాడు? సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రానున్న హీరో కోసం ఎలాంటి కథ సిద్ధంగా ఉంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం. 

మహేశ్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఆయన కొన్నాళ్ల పాటు హీరోగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడాయన వారసుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. ఎలాగైనా సినీ పరిశ్రమలో జయకృష్ణ హీరోగా నిలదొక్కుకునేలా, మహేష్ బాబు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట. 

అయితే, జయకృష్ణ డెబ్యూ మూవీని విలక్షణ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించనున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మాణంలో జయకృష్ణ మూవీ ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం విలేజ్ నేపథ్యంతో కూడిన లవ్ స్టోరీ, యాక్షన్ జోనర్లో ఓ కథను రాసుకున్నాడట అజయ్. గతంలో అజయ్ భూపతి తెరకెక్కించిన RX100, మహా సముద్రం, మంగళవారం సినిమాల తరహా ఓ ఇంటెన్స్ యాంగిల్ను చూపించనున్నాడట అజయ్. అయితే, జయకృష్ణ ఎంట్రీపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

జయ కృష్ణ ఘట్టమనేని అమెరికాలో తన నటనా కోర్సును పూర్తి చేసాడట. ఈ కీలకమైన కోర్సు తర్వాత, అతను తెరపై తన నటనను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన విభిన్న రకాలైన శిక్షణను తీసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. మరి వెండితెరపై జయకృష్ణ ఎంట్రీ ఎలా ఉండనుందో అని ఘట్టమనేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జయకృష్ణ లుక్ చూస్తే.. వంశీ, రాజా కుమారుడు వంటి సినిమాల్లో చూసిన మహేష్ బాబు తరహాలోనే ఉండటం విశేషం.  

రమేష్‌‌ బాబు సినిమాల విషయానికి వస్తే.. తండ్రి కృష్ణ సినిమాతోనే కెరీర్‌‌‌‌ స్టార్ట్ చేశాడు రమేష్‌‌ బాబు. దాదాపు పదిహేను వరకు సినిమాల్లో హీరోగా నటించారు. తన కెరీర్‌‌‌‌లో చాలాసార్లు తండ్రి కృష్ణతోను, తమ్ముడు మహేష్‌‌తోను రమేష్‌‌ కలిసి నటించారు.

ఆ ఇద్దరితోనూ కలిసి చేసిన ‘ముగ్గురు కొడుకులు’ చిత్రం తన కెరీర్‌‌‌‌లోనే బెస్ట్ అండ్ మెమొరబుల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కృష్ణ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రమేష్, మహేష్ ఆయనకి తమ్ముళ్లుగా నటించడం విశేషం. రమేష్‌‌ హీరోగా నటించిన ‘కలియుగ కర్ణుడు’ చిత్రాన్ని కూడా కృష్ణనే డైరెక్ట్ చేశారు.