అక్రమ నిర్మాణాలపై.. GHMC, MMC సైలెన్స్.. రెండు కార్పొరేషన్లలో నో యాక్షన్

అక్రమ నిర్మాణాలపై.. GHMC, MMC సైలెన్స్.. రెండు కార్పొరేషన్లలో నో యాక్షన్
  • చాలా చోట్ల 40, 50 గజాల్లో ఐదారంతస్తులు
  • సీఎంసీలోనే కూల్చివేతలు
  • అంజయ్యనగర్ ఘటన తర్వాత జోనల్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రెండు కార్పొరేషన్లలో నో యాక్షన్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు: అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్  కార్పొరేషన్లు వెనకబడ్డాయి. అంజయ్యనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50 గజాల్లో ఏడు ఫ్లోర్లలో నిర్మిస్తున్న భవనం కూలిపోవడంతో ఇక్కడి అధికారులు అక్రమ నిర్మాణాలపై మరింత దృష్టి పెట్టారు. కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఆదేశాలతో జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలో టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్ ను ఏర్పాటు చేసి అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. ఐదు రోజుల్లోనే 100కు పైగా భవనాలపై చర్యలు తీసుకున్నారు. కానీ, జీహెచ్ఎంసీతో పాటు మల్కాజిగిరి మున్సిపల్  కార్పొరేషన్​ అధికారులు మాత్రం సైలెన్స్​గా ఉన్నారు.

40, 50 గజాల్లోనే ఐదారు ఫ్లోర్లు..

జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 40, 50 గజాల్లోనే ఐదారు అంతస్తుల భవనాలను కడుతున్నారు. సెల్లార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు వరుసగా అంతస్తుపై అంతస్తు కడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న సమాచారం ఉన్నా ఇక్కడి అధికారులు కావాలనే ఫీల్డ్​కు వెళ్లడం లేదని తెలుస్తోంది. కొంత మంది ఫిర్యాదుదారులు నేరుగా ప్రజావాణికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా వాటిపై కూడా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ప్రతి సోమవారం ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో 90శాతం అక్రమ నిర్మాణాలపైనే ఉంటున్నాయని, అయితే ఎంక్వైరీ చేస్తామని వదిలేస్తున్నారని ఫిర్యాదుదారులు చెబుతున్నారు.

టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కడ?

సీఎంసీలో అంజయ్యనగర్​ ఘటన తర్వాత జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బృందాలను రంగంలోకి దింపి అక్రమ నిర్మాణాలపై నిఘా పెట్టారు. ఎక్కడ అక్రమ నిర్మాణం కనిపించినా నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. పక్క కార్పొరేషన్​లో ఇంత జరుగుతున్నా.. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ, ఎంఎంసీల్లో అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇక్కడ కూడా ప్రత్యేక జోనల్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బృందాలను ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, మల్కాజిగిరిల్లో ​నిర్మాణాల వేగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు  నిర్వహిస్తేనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే గుర్తించి అడ్డుకోవాల్సి ఉండగా.. కొన్ని సందర్భాల్లో నిర్మాణం పూర్తయిన తర్వాతే అధికారులు స్పందిస్తున్నారనే విమర్శలున్నాయి.