ఇప్పటికీ 20 ఏళ్ల కిందటి అద్దె రేట్లే

ఇప్పటికీ 20 ఏళ్ల కిందటి అద్దె రేట్లే

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఎంసీకి చెందిన ఖరీదైన భవనాలను ఖాళీగా ఉంచుతున్నారు. అప్పుల్లో కూరుకుపోతున్న బల్దియా ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెట్టాల్సి ఉండగా.. ఆ పని మాత్రం చేయడం లేదు.  గ్రేటర్​ పరిధిలోని ఆరు జోన్లలో జీహెచ్ఎంసీకి దాదాపు లక్ష కోట్ల  విలువ చేసే  ఆస్తులున్నాయి. వీటి మెయింటెనెన్స్, పరిరక్షణతో పాటు అద్దె వసూలు చేయాల్సిన బాధ్యత  ఎస్టేట్ విభాగం అధికారులపైనే ఉంది. వారు పట్టించుకోకపోవడంతో బల్దియా ఆదాయాన్ని కోల్పోతోంది.  గ్రేటర్​లో మొత్తం జీహెచ్ఎంసీకి  22 కమర్షియల్ బిల్డింగ్స్​, 16 మార్కెట్లు, బిల్డింగ్స్​లో 3 వేల స్టాల్స్​ ఉన్నాయి. కొన్నింటిలో జీహెచ్ఎంసీ ఆఫీసులు కొనసాగుతుండగా.. మిగతా వాటిని లీజుకు అప్పగించింది.

చాలా భవనాలకు 20 ఏళ్ల కిందట లీజుకు ఇచ్చిన అద్దె రేట్లనే  కొనసాగిస్తున్నారు. కొత్తగా టెండర్లు వేసి వేలం పాట ద్వారా ఇవ్వాల్సిన ఆస్తులను పాత రేట్లతోనే కొనసాగిస్తుండటంతో  ఏడాదికి దాదాపు రూ.50 కోట్లు నష్టపోతోంది. గ్రేటర్​లో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, ఎల్​బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి ఇలా ఆరు జోన్లు ఉండగా..ఎక్కువగా 3 జోన్లలలోనే బల్దియా ఆస్తులున్నాయి.  అబిడ్స్​ కాంప్లెక్స్​లో షాప్​లను  1994లో అలాట్​ చేయగా,  1997లో లీజు  ముగిసినా అధికారులు అదే రేటుకు తిరిగి వారికే అప్పగించారు.  కోఠి బస్​ డిపోలో  లీజు  2013 లోనే ముగిసినా పాత కిరాయితోనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 

కొత్తగా టెండర్లు వేస్తే..

చార్మినార్ జోన్​లోని మలక్​పేట ​జీహెచ్ఎంసీ కాంప్లెక్స్​లో కేవలం ఒక్క షాపు నుంచి నెలకు లక్షకుపైగా అద్దె వస్తోంది. ఇక్కడ కొత్త రేట్లతో టెండర్లు వేయడంతోనే ఇంత మొత్తం వస్తుంది.  మలక్ పేట​ తరహాలో మిగతా వాటికి కొత్తగా టెండర్లు వేస్తే ప్రస్తుతం వస్తున్న రెంట్​కు ఐదారు రేట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని పలువురు అధికారులు చెప్తున్నారు. 

సికింద్రాబాద్​ జోన్ - హరిహర కళాభవన్​లో

షాపులు                                  ఒక్కోదానికి రెంట్ (నెలకు)

ఎస్​పీ రోడ్​ వైపు 13                  రూ.4,200  నుంచి  రూ.13,125 

ఆర్పీ రోడ్ వైపు  4                    రూ. 12 వేల నుంచి రూ.68 వేలు

అలెగ్జాండర్ రోడ్ వైపు 6          రూ.6,163 

1,3,4  ఫ్లోర్లలో ‌‌‌‌‌‌‌‌- పవర్ గ్రిడ్       రూ. 3 లక్షల 75 వేలు 

2, 5  ఫ్లోర్లలో - ఎన్టీపీసీ             రూ.32 లక్షల 3 వేల 925 

బుద్ధభవన్​లో 34 షెట్టర్లు       రూ. 25 వేలు

ఖైరతాబాద్ జోన్ - అబిడ్స్ మున్సిపల్ కాంప్లెక్స్ 

షాపులు    ఖాళీగా ఉన్నవి    రెంట్ నెలకు 

గ్రౌండ్ ఫ్లోర్​లో 24 ,10            వెయ్యి నుంచి 10 వేలు

సెల్లార్​లో 50,50                    సుమారు 3 లక్షలు