మూడు షిప్టుల్లో 24 గంటల పాటు ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనరల్ రోనాల్డ్ రాస్ తెలిపారు. జనవరి 9 వరకు 4 లక్షల అప్లికేషన్లు ఆన్ లైన్ లో ఎంట్రీ చేశామన్నారు. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిల్స్ లో వచ్చిన ప్రజాపాలన అప్లికేషన్లను అప్లోడ్ చేస్తున్నామన్నారు.
స్వీకరించిన ప్రతీ అప్లికేషన్ ను అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు కమిషనర్. అప్లికేషన్ అప్లోడ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక్క టీం లీడర్ ను సస్పెండ్ చేశాం..మరొకరిని వివరణ అడిగామన్నారు. ఫస్ట్ అభయహస్తంకు సంబంధించిన అప్లికేషన్స్ అప్లోడ్ చేసి తర్వాత ఇతర అప్లికేషన్లను అప్లోడ్ చేస్తామన్నారు.
