137 ప్రశ్నలడిగితే.. 23 అప్రూవల్..!

137 ప్రశ్నలడిగితే.. 23 అప్రూవల్..!
  • నామ్​కే వాస్తేగా కౌన్సిల్​ నిర్వహణకు బల్దియా ప్లాన్
  • 56 మంది సభ్యులున్న టీఆర్​ఎస్​కు ఆరు ప్రశ్నలకు ఓకే !
  • మిత్రపక్షమైన ఎంఐఎంకు నో చాన్స్​

హైదరాబాద్​, వెలుగు: ఈనెల18న జరగనున్న బల్దియా కౌన్సిల్ ​మీటింగ్​లో మరోసారి అధికార టీఆర్​ఎస్​ తప్పించుకునే ప్రయత్నాలకు ప్లాన్ ​చేసింది.  కరోనా అంటూ గత మీటింగ్​ను వర్చువల్​గా నిర్వహించి తప్పించుకున్నా,  ఈసారి తప్పనిసరిగా  ఫిజికల్​మీటింగ్​పెట్టాల్సి వచ్చింది. ఈసారి కూడా నామ్​కే వాస్తేగా కౌన్సిల్​ నిర్వహించేందుకు వ్యూహం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం కనిపించడం లేదు. కౌన్సిల్​మీటింగ్​పెట్టాలని పలుమార్లు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనలు చేశారు.  ఇటీవల మేయర్ ఛాంబర్​ని కూడా ముట్టడించగా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని బీజేపీ కార్పొరేటర్లు  ప్రశ్నిస్తుండగా హడావుడి లేకుండానే కౌన్సిల్​నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కానీ ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం కనిపిస్తలేదు. అన్ని పార్టీల సభ్యులు 137 ప్రశ్నలు అడగగా, కేవలం 23 ప్రశ్నలకు మాత్రమే బల్దియా అప్రూవల్​ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో బీజేపీ నుంచి 96  ప్రశ్నలు రాగా, 11 ప్రశ్నలకు, ఎంఐఎం సభ్యుల నుంచి 34 ప్రశ్నలకు, కేవలం 7 ప్రశ్నలకు, టీఆర్ఎస్ ​నుంచి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే 6 ప్రశ్నలను అడిగారు. వీటిలో 4 ప్రశ్నలకు, కాంగ్రెస్​ సభ్యులు  అడిగిన ఒక ప్రశ్నకు జవాబులు ఇచ్చేందుకు బల్దియా అప్రూవల్ ఇచ్చినట్లు సమాచారం. 

బీజేపీ సభ్యుల నుంచి వచ్చినవి
బీజేపీ కార్పొరేటర్లు ముందు నుంచి ప్రజా సమస్యలపై చర్చించేందుకు కౌన్సిల్​ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొదటి మీటింగ్​కరోనా కారణంగా వర్చువల్​గా ఏర్పాటు చేసి అప్పట్లో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండానే దాటవేశారు. ఈసారి మస్ట్​గా సమాధానాలు ఇవ్వాలని ఆ పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. అడిగిన ప్రశ్నల్లో ప్రధానంగా వరదసాయం ఎంతమందికి ఇచ్చారని, ఎన్నికోట్లు ఖర్చు పెట్టారని, ఆ నిధులు  ఎక్కడి నుంచి వచ్చాయని, ఎస్ ఆర్ డీపీ రోడ్లకు సంబంధించి సంస్థలకు బల్దియా అందించిన ఫండ్స్,​ చేయాల్సిన మెయింటెనెన్స్​వివరాలు,  చెత్త నిర్వహణకు రాంకీ సంస్థకు చెల్లిస్తున్న ఫండ్స్​ వివరాలు, నాలాల విస్తరణ, వరదలు  రాకుండా తీసుకుంటున్న చర్యలు, 2019 నుంచి 2021కి సంబంధించి పబ్లిక్​టాయిలెట్ల కోసం చేసిన ఖర్చు లు, ప్రస్తుతం వాడకంలో ఉన్న టాయిలెట్ల సంఖ్య తదితర వాటిపై మొత్తం 96 ప్రశ్నలను బీజేపీ సభ్యులు అడిగారు. కేవలం 11 కి మాత్రమే జవాబులు ఇచ్చేందుకు బల్దియా రెడీ అయింది. 

టీఆర్ఎస్ ​నుంచి ముగ్గురే..
సిటీలో సమస్యలు లేవన్నట్టుగానే టీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ప్రశ్నలను అడిగారు. మేయర్, డిప్యూటీ మేయర్ లతో సహా మొత్తం 56  మంది సభ్యులుండగా  కేవలం ఆరు ప్రశ్నలు అడిగారు. అందులో కేవలం 4 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు అప్రూవల్ ​ఇచ్చింది. 

మిత్రపక్ష పార్టీకి నో చాన్స్ 
ఎంఐఎం నుంచి 44 మంది సభ్యులుండగా 34 ప్రశ్నలకు జవాబులు అడిగారు. ఇందులో ఏడింటికి మాత్రమే  అప్రూవల్ ​ఇచ్చారు. ప్రశ్నలకు జవాబులు లేకుండానే సమావేశం ముగియనుంది.

9 అంశాలకు ఆమోదం 
స్టాండింగ్ కమిటీ రెండో సమావేశం బుధవారం మేయర్ అధ్యక్షతన బల్దియా హెడ్డాఫీసులో జరిగింది. 11 అంశాలపై చర్చించిన సభ్యులు 9 అంశాలకు ఆమోదం తెలిపారు. ఆ అంశాలివే.. హౌసింగ్ డిపార్ట్​మెంట్​లో  ఔట్ సోర్సింగ్  ద్వారా 250 మంది  ఉద్యోగుల సర్వీస్ ఏడాది పాటు పొడిగింపు, కొత్త ఏజెన్సీ తో ఒప్పందం, రిటైర్డ్ ఉ ద్యోగులకు గ్రాట్యుటీ 12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు చెల్లింపు, పే రివిజన్ ప్రకారంగా  సర్వీస్, ఫ్యామిలీ పెన్షనర్స్ కి  పెరిగిన వేతనం, ఉద్యోగులకు పే రివిజన్  శాలరీలు చెల్లింపు, బేగం పేట్  సర్కిల్​లో రూ. 5.90 కోట్లతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ  స్థలాన్ని పాటిగడ్డ నుంచి బేగంపేటకు మార్చుట,  ద్వారకాపురి  కాలనీ ఒక లేయర్ బీటీ, సీసీ రోడ్డు పునరుద్ధరణ, ఫుట్ పాత్ నిర్మాణానికి రూ. 2.90 కోట్లు మంజూరు, ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వద్ద  రూ. 4.96 కోట్లు, జంగం మెట్ డివిజన్ లో  రూ. 4.96 కోట్లలో నిర్మించే  మల్టీ  పర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి పరిపాలన మంజూరుకు ఆమోదం తెలిపారు.  

నిరూపిస్తే చెవి కోసుకుంటా: మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయలక్ష్మి
బీజేపీ కార్పొరేటర్లను కలవడం లేదనే ఆరోపణలు అవాస్తవమని, నిరూపిస్తే చెవి కోసుకుంటానని మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గద్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయలక్ష్మి వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వస్తువులను బీజేపీ కార్పొరేటర్లు ధ్వంసం చేయలేదని, ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటున్నానని, అందుకే అన్ని డివిజన్లలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు.  అధికారులు, కార్పొరేటర్ల మధ్య ఉన్న గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అందరినీ కలుపుకొని వెళ్తున్నానని, కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశంలో అది చూస్తారని తెలిపారు. 

జనాల్లోకి వెళ్లలేకపోతున్నం
బల్దియా జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్​లో బీజేపీ కార్పొరేటర్లను దీటుగా ఎదుర్కోవాలని మంత్రులు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్లకు సూచించినట్టు సమాచారం. మీటింగ్​లో బీజేపీ కార్పొరేటర్లు లేవనెత్తే అంశాలపైన సమయానుకూలంగా సభ్యులంతా స్పందించాలని దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది.  ఈనెల18న మీటింగ్ జరగనుండగా ఇందులో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రులు పార్టీ కార్పొరేటర్లతో సమావేశమై చర్చించారు.  ఇటీవల బల్దియా ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముట్టడి పేరుతో బీజేపీ నేతలు బీభత్సం సృష్టించారని గుర్తు చేసుకున్నట్టు, ఆ పార్టీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు.  ప్రస్తుత పాలకవర్గం ఎన్నికైన తర్వాత ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న ఫస్ట్​ మీటింగ్​అని, 56 మంది కార్పొరేటర్లు ముందేగానే  హాజరుకావాలన్నారు. ఎన్నికైన తర్వాత ఎలాంటి నిధులు రాలేదని, ప్రజలకు ఏమి చేయలేకపోయామని, డివిజన్లలో ఎలా పర్యటించాలని కార్పొరేటర్లు ప్రశ్నించారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ, కరోనాతో నిధుల విడుదలలో సమస్యలున్న మాట నిజమేనని, ఇకపై అలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రులు వివరించారు. కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతిపక్ష కార్పొరేటర్లు అడిగే ప్రశ్నలను తిప్పికొట్టాలంటే  ప్రభుత్వం అభివృద్ధి పనులు, కార్యక్రమాలు తెలియజేయాలన్నారు.  సమావేశంలో మంత్రులు తలసాని, మహమూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ, సబితా రెడ్డి, మల్లారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, ఎంపీ రంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.