హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీ విలీనం తర్వాత వార్డుల డీలిమిటేషన్పై సభ్యుల అభిప్రాయాలు సేకరించేందుకు బల్దియా స్పెషల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 16న జరగనుంది. 9న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత వారంపాటు (15 వరకు) ప్రజల నుంచి జీహెచ్ఎంసీ అభ్యంతరాలు స్వీకరిస్తోంది. ఇందులో వచ్చిన అభ్యంతరాలపై 16న జరిగే సమావేశంలో సభ్యుల అభిప్రాయాలపై చర్చించి డీలిమిటేషన్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు నిలదీసే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీలు ఇప్పటికే డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నాయి.
18న స్టాండింగ్ కమిటీ సమావేశం
కౌన్సిల్ తర్వాత 18న స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించి 2026-–27 వార్షిక బడ్జెట్‌పై చర్చించనున్నారు. విలీనమైన 27 సర్కిళ్లతో కలిపి రూపొందిస్తున్న బడ్జెట్ పై చర్చ జరిగి, తర్వాత మరో కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ఇది బడ్జెట్ సమావేశంగా చివరిది కానుంది.

