
- జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ డిమాండ్
- రూ.2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
గండిపేట,వెలుగు: ‘నీ హోటల్ రూల్స్‌కు విరుద్ధంగా ఉంది.. సరైన వసతులు లేవు.. నేను అటు వైపు చూడొద్దు, హోటల్ మూయొద్దు అంటే ఐదు లక్షలియ్యాలి’ అంటూ మునిసిపల్ అధికారి ఓ హోటల్ యజమానిని హెచ్చరించాడు. అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. సదరు వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా వారు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో ఓ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, సీజ్ చేయొద్దంటే తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ డిమాండ్ చేశారు. చివరకు రూ.2 లక్షలు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. బాధితుడు ఏసీబీకి విషయం చెప్పాడు. శుక్రవారం జీహెచ్ఎంసీ ఆఫీసులోని తన చాంబర్లో రూ.2 లక్షలు తీసుకుంటుండగా రవికుమార్‌ను ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.