
తార్నాక, వెలుగు: రోడ్లను, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి తార్నాక ఎక్స్ రోడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన దుకాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు.
కొంతమంది వ్యాపారులు చెత్తను రోడ్లపై వేస్తూ పరిసరాలను నాశనం చేస్తున్నారన్నారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి దుకాణాలు నిర్మిస్తున్న వారి వివరాలను సేకరించామని, త్వరలో యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.