ఎల్లారెడ్డిపేట, వెలుగు: చిన్నారిని చితకబాదిన అంగన్‌వాడీ టీచర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైనట్లు ఎస్‌ఐ రాహుల్‌రెడ్డి తెలిపారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొంపెల్లి లక్ష్మి–విజయ్ దంపతుల మూడేండ్ల కొడుకు విద్వాన్స్‌ను ప్రతిరోజూ అంగన్‌వాడీ సెంటర్‌కు పంపిస్తున్నారు.
ఈ నెల10న టీచర్ సల్వాని రాణి చిన్నారిని ముఖంపై కొట్టడంతో కుడి కన్ను వాచిపోయి నల్లగా మారింది. చికిత్స కోసం చిన్నారిని హైదరాబాద్ నిలోఫర్ హస్పిటల్‌లో చేర్పించారు. మరుసటి రోజు పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేసి టీచర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
