ఇకపై సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో స్టీమ్ రైస్ :సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్రవీంద్ర

ఇకపై సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో స్టీమ్ రైస్ :సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్రవీంద్ర
  • సివిల్​ సప్లయ్స్​ కమిషనర్ స్టీఫెన్​రవీంద్ర వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇకపై రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లకు స్టీమ్​రైస్ సరఫరా చేయనున్నట్లు సివిల్​సప్లయ్స్​కమిషనర్ స్టీఫెన్​రవీంద్ర వెల్లడించారు. ఇందుకోసం  నాణ్యమైన బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌‌లోని సర్కిల్- 4 (నాంపల్లి), సర్కిల్- 6 (అంబర్‌‌పేట్) ఎంఎల్‌‌ఎస్ పాయింట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతను  సమగ్రంగా పరిశీలించారు.

స్టీమ్ రైస్ సరఫరాతో వెల్ఫేర్ హాస్టళ్లు, పాఠశాలల్లోని విద్యార్థులకు ఫుడ్​నాణ్యత పెరుగుతుందన్నారు. సోషల్ వెల్ఫేర్ అధికారుల నుంచి వచ్చిన ఫీడ్‌‌బ్యాక్ ప్రకారం.. ప్రస్తుత బియ్యం నాణ్యతపై ఎక్కువ సంతృప్తి వ్యక్తమైంది. సప్లయ్ చైన్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్‌‌ను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఫిజికల్​స్టాక్ రిజిస్టర్లు, జీపీఎస్ ఆధారిత వాహన ట్రాకింగ్ సిస్టమ్‌‌తో సరిపోల్చి చూశారు. ఇది జవాబుదారీతనాన్ని మరింత పెంచుతుందని అధికారులకు సూచించారు.

గోదాంలలో పనిచేసే హమాలీలతో మాట్లాడిన రవీంద్ర..వారి అక్సిడెంట్ ఇన్సూరెన్స్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు.  వెంటనే రెస్ట్ షెడ్ ఏర్పాటు చేయాలని జిల్లా మేనేజర్‌‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ జిల్లా మేనేజర్ కె. సాయి అరుణ్, అదనపు జిల్లా మేనేజర్ దీప్తి, గోదాం ఇన్‌‌చార్జ్‌‌లు గోపాలకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.