-fell-from-the-building-and-died-at-kookatpalli-Hyderabad_4LJmeNOcQR.jpg)
కూకట్పల్లి, వెలుగు: ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి కింద పడి బల్దియా ఉద్యోగి చనిపోయిన ఘటన కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో జరిగింది. కేపీహెచ్‌బీకాలనీ ఫేజ్–2లో ఉంటోన్న కమలరాజ్మెహ్ర(50) జీహెచ్ఎంసీ సంతోష్‌నగర్ సర్కిల్ లో ఎంటమాలజీ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 9.20 గంటలకు బిల్డింగ్ మూడో అంతస్తులోని పెంట్ హౌస్ కు వెళ్లిన కమల్ రాజ్ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని భార్య వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లింది. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.