జీహెచ్ ఎంసీ: సర్కారీ బడులపై ఫోకస్: మిడ్ డే మీల్స్ పై తనిఖీలు

 జీహెచ్ ఎంసీ:  సర్కారీ బడులపై  ఫోకస్: మిడ్ డే మీల్స్ పై తనిఖీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మిడ్ డే మిల్స్ పై తనిఖీలు చేయాలని బల్దియాకు డీఈవో లెటర్ రాయడంతో బల్దియా చర్యలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్​ జిల్లాలో మొత్తం 697 స్కూల్స్ ఉండగా, జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు ర్యాండమ్ గా తనిఖీలు చేయనున్నారు. 

ప్రతి నెలా ఆరు స్కూళ్ల చొప్పున తనిఖీలు నిర్వహించడంతో పాటు ఆయా స్కూల్స్ లో ఫుడ్ శ్యాంపిల్స్ సేకరించి టెస్టు కోసం ల్యాబ్ కు పంపనున్నారు. రిపోర్టును విద్యా శాఖ అధికారులకు అందించనున్నారు. ముందుగా ఈ రెండు రోజుల్లో ఆరు స్కూల్స్ లో తనిఖీలు చేయనున్నట్లు తెలిసింది. ఆ తరువాత రెగ్యులర్​గా అన్ని స్కూళ్లలో తనిఖీలు ఉంటాయి.