గండిపేట, వెలుగు: రోడ్డు పక్కన చెత్తను డంప్చేస్తున్న ఆటో డ్రైవర్కు రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రూ.10 వేల జరిమానా విధించారు. బండ్లగూడ ప్రాంతానికి చెందిన హుస్సేన్ తన ఆటోలో చెత్తాచెదారాలతో పాటు కుళ్లిపోయిన ఉల్లిగడ్డను తీసుకువచ్చి ఆర్మీ స్కూల్ ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బుధవారం డంపు చేశాడు. ఇదే సమయంలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ వస్తున్న ఉప కమిషనర్ సురేందర్‌రెడ్డి విషయాన్ని గమనించి ఆటో డ్రైవర్ హుస్సేన్‌ను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రెండు పక్కల చెత్తాచెదారాలను డంపు చేయడం జీహెచ్‌ఎంసీ యాక్ట్ ప్రకారం విరుద్ధమన్నారు. చెత్తను డంపు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఉప కమిషనర్ రూ.10 వేల జరిమానా విధించారు. మరోసారి డంప్ చేస్తే వాహనాన్ని జప్తు స్తామని హెచ్చరించారు.
