చెత్త సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ వాట్సాప్

చెత్త సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ వాట్సాప్
  • ఫొటో పెట్టి లొకేషన్​షేర్​చేస్తే పనైపోయినట్టే  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో చెత్త సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్​ కార్పొరేషన్లు వాట్సాప్​ఫిర్యాదులను స్వీకరిస్తన్నాయి. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త వేసినా, చెత్త డబ్బాలు నిండిపోయినా, ఇతర పారిశుధ్య సమస్యల గురించి వాట్సాప్​లో ఫొటో పంపించి లొకేషన్​షేర్​చేస్తే సరిపోతుంది.

ఇందులో భాగంగా  హైదరాబాద్​కార్పొరేషన్​పరిధిలో ఫిర్యాదులు స్వీకరణకు 8125966586 కి వాట్సాప్ నంబర్​ఏర్పాటు చేశారు. చెత్తకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వాట్సాప్​చేయాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ కర్ణన్​కోరారు.  ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 9063421347 వాట్సాప్​నంబర్‌‌‌‌ , మల్కాజిగిరి   పరిధిలో 9063421300 నెంబర్ ఏర్పాటు చేశారు.