
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో శానిటేషన్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్లో 30 సర్కిళ్లు ఉండగా, రోజుకు ఒక వార్డుని క్లీన్ చేయాలని నిర్ణయించారు. సర్కిల్ పరిధిలోని సిబ్బంది అంతా ఎంపిక చేసిన వార్డులోని పనుల్లో పాల్గొనేలా ప్లాన్చేశారు. సిబ్బంది అంతా కలిసి పనిచేస్తే బల్క్ చెత్త అంతా ఒకేసారి డంపింగ్ యార్డుకు తరలించేందుకు వీలుంటుంది. పారిశుద్ధ్య కార్మికుల పనివేళల్లో ఎలాంటి మార్పులు చేయకుండా అంతా కలిసి విధులు నిర్వహించాలని కమిషర్ఆదేశాలు జారీ చేశారు.
కొత్త నిర్ణయంతో చెత్త సమస్యకు చెక్పడే అవకాశముందని కమిషనర్ భావిస్తున్నారు. శానిటేషన్వింగ్ లో 18 వేల మందికి పైగా కార్మికులు ఉంగా, వీరిలో 15 వేల మంది మహిళలే. తాజాగా కమిషనర్ తీసుకున్న నిర్ణయంతో వీరి పని వేళల్లో మొదటి గంట నుంచి రెండు గంటల పాటు ఒక సర్కిల్ లోని వందలాది మంది స్వీపర్లు ఒక వార్డులో విధులు నిర్వర్తించనున్నారు. తర్వాత తిరిగి వారు రొటీన్ డ్యూటీలకు హాజరుకావాల్సి ఉంటుంది.
గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన
మిస్వరల్డ్పోటీల కోసం గచ్చిబౌలి స్టేడియంలో చేసిన ఏర్పాట్లను కమిషనర్ కర్ణన్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువ మంది సిబ్బందితో క్లీనింగ్చేయించాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం చుట్టూ పోటీల వివరాలు తెలిసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ బొఖడే హేమంత్ సహదేవ్ రావు, అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, డీసీ ప్రశాంతి ఉన్నారు.