తెలుగు తల్లి ఫ్లైఓవర్ కు తెలంగాణ తల్లి పేరు!

తెలుగు తల్లి ఫ్లైఓవర్ కు తెలంగాణ తల్లి పేరు!

హైదరాబాద్​ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్​లో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో 14  అంశాలు, 10 టేబుల్ ఐటమ్స్​కు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి,  జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు సత్యనారాయణ, వేణుగోపాల్, పంకజ, అలివేలు మంగతాయారు, సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు.

  • ప్రధానంగా లోయర్ ట్యాంక్ నుంచి సచివాలయంవైపు వచ్చే తెలుగుతల్లి ఫ్లైఓవర్​ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్​గా పేరు మార్చాలని ప్రతిపాదించారు. టేబుల్ ఐటెమ్​కింద ఈ సిఫార్సును కార్పొరేషన్​కు పంపనున్నారు.  
  •  జీహెచ్‌‌‌‌ఎంసీలోని 145 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న మెడికల్ ఇన్సూరెన్స్ వారి పదవీకాలం ముగిసే వరకు (ఫిబ్రవరి 2026 వరకు) పొడిగించేందుకు రూ.33.53 లక్షలు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. 
  •  అలాగే స్ట్రీట్ లైట్స్ నిర్వహణ కోసం మూడు నెలల పాటు కొత్త టెండర్లు పిలవాలా లేదా ప్రస్తుత 17 మంది డీఐసీ విక్రేతలతో కాంట్రాక్ట్​ను పొడిగించాలా అనే నిర్ణయం తీసుకునేందుకు సభ్యులు అనుమతించారు. 
  • ఏటా భవిష్యత్తులో అవసరమని భావించిన రోజుల్లో మాంసం, బీఫ్ దుకాణాలు, వధశాలలను మూసివేసే అధికారాన్ని జీహెచ్​ఎంసీ కమిషనర్‌‌‌‌కు ఇవ్వడానికి ఆమోదించారు. 
  • జీహెచ్​ఎంసీ ఔట్‌‌‌‌ సోర్సింగ్ స్వయం సహాయక సంఘాల వర్కర్ల జీత ఖాతాలను ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రారంభించడంతో పాటు, వారికి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లబ్ధి కల్పించేందుకు ప్రతిపాదించారు.