V6 News

హైదరాబాద్ లో  ఇంటర్నల్ రోడ్లకు గ్రీన్సిగ్నల్.. స్పోర్ట్స్ కార్యకలాపాలకు యూజర్ ఫీజుల వసూలు  

హైదరాబాద్ లో  ఇంటర్నల్ రోడ్లకు గ్రీన్సిగ్నల్.. స్పోర్ట్స్ కార్యకలాపాలకు యూజర్ ఫీజుల వసూలు  
  •  జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగులో ఆమోదం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ఆధ్వర్యంలో మంగళవారం హెడ్ ఆఫీసులో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లో ఏడు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఏవీ నగర్ ఫేజ్ -3,4, ఉశయ్య కాలనీ, లక్ష్మీగణపతి, హ్యాప్యీ హోమ్, ఎస్సీ బస్తీ, సైనర్జీ హోమ్స్, అభ్యుదయ నగర్, ద్వారకానగర్, శ్రీనివాస సిలికాన్ సిటీ, తుర్కయంజాల్, ఆదిబట్ల ప్రాంతాల్లో ఇంటర్నల్​రోడ్ల ఏర్పాటుకు రూ.5 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చారు. ఏవీనగర్ ఫేజ్-2, సాయి బృందావన్ కాలనీ, నల్ల నారాయణ కాలనీ, తుర్క యంజాల్ ఓల్డ్ విలేజ్ ప్రాంతాల్లో ఇంటర్నల్ రోడ్ల కోసం రూపొందించిన మరో రూ. 5 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

ఏవీనగర్ ఫేజ్-1, ఆదిత్య నగర్, మ్యాట్రిక్స్ రిచ్ వ్యాలీ, టీచర్స్ గ్రిల్డ్ కాలనీ ప్రాంతాల్లో కూడా ఇంటర్నల్​రోడ్ల కోసం రూపొందించిన రూ. 3.92 కోట్ల ప్రతిపాదనలకు ఓకే చెప్పారు. జీహెచ్ఎంసీలోని అడిషనల్ కమిషనర్ ( అడ్మిన్) కు పలు అధికారాలను కేటాయిస్తూ వచ్చిన ప్రతిపాదనకు ఆమోదం చెప్పారు. ఆదిబట్ల సర్కిల్ లోని శ్రీనివాసపురం కాలనీ, శ్రీగణేశ్ రంగాపురం కాలనీ, ఓం గణేశ్ నగర్, గణేశ్ నగర్, సాయి బృందావనం కాలనీ, జీవీఆర్ కాలనీ, సామ రెసిడెన్సీ, ధుర్గంజందరి కాలనీల్లో సీసీ రోడ్ల కోసం రూపొందించిన రూ. 3.5 కోట్ల ప్రతిపాదనలను ఆమోదించారు. జీహెచ్ఎంసీ పరిధిలో స్పోర్ట్స్ కార్యకలాపాలకు యూజర్ ఫీజులు వసూలు చేయాలన్న ప్రతిపాదనకు కూడా స్టాండింగ్ కమిటీ అనుకూలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఆజంపురా డివిజన్ లోని మూసారాంబాగ్ సర్కిల్ ఆఫీసును స్టిల్ట్ పార్కింగ్, రెండు అంతస్తులుగా నిర్మించేందుకు  వీలుగా రూపొందించిన సుమారు రూ. 5.90 కోట్ల ప్రతిపాదనకు కూడా స్టాండింగ్  కమిటీ ఆమోదం తెలిపింది. ఎంఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం కూడా మంగళవారం తార్నాకలోని హెడ్ ఆఫీసులో స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగింది.