చెత్త తొలగిస్తుండగా మిషన్ లో పడి.. జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి

చెత్త తొలగిస్తుండగా మిషన్ లో  పడి.. జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి

హైదరాబాద్ యూసఫ్ గూడలో  దారుణం జరిగింది.  చెత్త తొలగిస్తుండగా చెత్త తొలగింపు మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. జనవరి 24న ఉదయం చెత్త తొలగించే మిషన్ లోపలికి లాగటంతో మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. 

 యూసఫ్ గూడలో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఈ ఘటన జరిగింది.  రాంకీ సంస్థ నిర్లక్ష్యంతోనే  కార్మికుడు చనిపోయాడని మృతుడి బంధువులు,తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ : హామీల అమలులో ప్రభుత్వం విఫలం

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్మికుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్మికుడి మృతికి గల కారణాలపై దర్యా్ప్తు చేస్తున్నారు.