ఇవాళ్టి (ఆగస్టు18) నుంచి బల్దియా కార్మికుల సమ్మె

ఇవాళ్టి (ఆగస్టు18) నుంచి బల్దియా కార్మికుల సమ్మె

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ జీహెచ్ఎంసీ కార్మికులు శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు.  విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతున్నట్లు జీహెచ్ఎంఈయూ ప్రెసిడెంట్ గోపాల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని, పోలీసులకు అందిస్తున్న విధంగా ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. పెండింగ్ డీఏలు వెంటనే ఇవ్వాలన్నారు. 
రాంకీ సంస్థతో  ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, ట్రాన్స్​పోర్టు సెక్షన్ లో  తొలిగించిన లేబర్,  డ్రైవర్లను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  నేటి నుంచి అన్ని సర్కిల్, జోనల్ ఆఫీసులతో పాటు హెడ్డాఫీసు వద్ద కార్మికులు సమ్మె నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.  సమ్మెను కార్మికులు సక్సెస్  చేయాలని కో రారు. అన్ని సర్కిల్ ఆఫీసుల వద్ద  సమ్మెలో  ఏం చేయాలనే దానిపై కార్మికులు చర్చించారు.