మొహంలాంటి చెయ్యి.. చెయ్యి లాంటి మొహం!

మొహంలాంటి చెయ్యి.. చెయ్యి లాంటి మొహం!

న్యూజిలాండ్​ జనాన్ని ఇప్పుడీ బొమ్మ పెద్ద పీడకలలా వెంటాడుతోంది. ఇంత అసహ్యమైన, చెత్త బొమ్మను ముందు తీసేయండంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. ‘ఖాసీ’గా పిలుస్తున్న ఈ చెయ్యి మొహం బొమ్మను వెల్లింగ్టన్​లోని సిటీ ఆర్ట్​గాలరీపైన నిలబెట్టారు. 16 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం బరువు 400 కిలోలు. ఇంతకుముందు క్రైస్ట్​చర్చ్​ ఆర్ట్​ గ్యాలరీ బిల్డింగ్​పై ఉన్న ఈ విగ్రహాన్ని హెలికాప్టర్​తో తీసుకొచ్చి వెల్లింగ్టన్​ ఆర్ట్​ గ్యాలరీపై పెట్టారు. దానికి అయిన ఖర్చు సుమారు ₹33.77 లక్షలట (39 వేల పౌండ్లు). ఈ విగ్రహాన్ని 2016లో రోనీ వాన్​ హౌట్​ అనే ఆర్టిస్ట్​ తయారు చేశాడు. ఇప్పుడీ బొమ్మపైనే జనం మండిపడుతున్నారు. ‘‘మీ మొహంలా ఉందీ చెయ్యి మొహం’’ అంటూ విరుచుకుపడుతున్నారు. ‘‘ఇంత అసహ్యమైన బొమ్మను కళ అని చెప్పుకుని తిరుగుతారా’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. పీడకలలా వెంటాడుతుందని అంటున్నారు. అంతేకాదు, ‘‘అచ్చం ట్రంప్​లా ఉందే ఈ చెయ్యి మొహం’’ అని సెటైర్లు పేలుస్తున్నారు. విక్టర్​ హ్యుజో రాసిన ద హంచ్​బ్యాక్​ ఆఫ్​ నోటర్​ డాం బుక్కులోని ఖాసిమోడో పాత్ర స్ఫూర్తిగా దీనిని తయారు చేయించారు. వెల్లింగ్టన్​ ఆర్ట్​ గ్యాలరీపై మూడేళ్ల పాటు ఈ బొమ్మ ఉండనుంది.