జిన్నా మూవీ నుంచి అప్ డేట్

జిన్నా మూవీ నుంచి అప్ డేట్

టాలీవుడ్ హీరో ‘మంచు విష్ణు’ లెటెస్ట్ మూవీ ‘జిన్నా’ షూటింగ్ కొనసాగుతోంది. చిత్రానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా.. మూవీకి సంబంధించిన ఓ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసింది. ‘ఓ గోలిసోడావే.. గుండెకాయ మత్తెక్కె పాను బీడావే.. మైండ్ కాస్త పిచ్చెక్కే అందాలు మెక్కేశావే’ అంటూ సాంగ్ సాగుతుంది. మంచు విష్ణు.. పాయల్ రాజ్ పుత్ తో కలిసి స్టెప్పులేశారు. ఈ పాటను పూర్తిగా వినాలంటే.. సెప్టెంబర్ 19 దాక వెయిట్ చేయాల్సిందే. సాంగ్ ను 11.12 నిమిషాలకు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన విషయాన్ని మంచు విష్ణు ట్వీట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

ఈశాన్ సూర్య దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ‘సన్ని లియోన్’ నటించారు. ఇప్పటికే పాయల్ రాజ్ పుత్, సన్ని లియోన్ లకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లు అభిమానులను అలరించాయి. కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోంది.  ఈ సినిమా భారీ తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.