
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గిరిగేట్పల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధంపై గ్రామస్తులు ఆదివారం సమావేశం నిర్వహించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్. రాంచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇకపై గ్రామంలో మద్యం అమ్మితే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని గ్రామసభ నిర్ణయించింది. మద్యం కారణంగా అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని, అందుకే మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు మహిళా, యువజన సంఘాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మద్యం బాటిళ్లను రాళ్లతో ధ్వంసం చేశారు.