బాలికతో ఫ్రెండ్‌‌‌‌షిప్ చేస్తుండని కొట్టి చంపిన్రు

బాలికతో ఫ్రెండ్‌‌‌‌షిప్ చేస్తుండని కొట్టి చంపిన్రు

ఢిల్లీలో స్టూడెంట్ పై ఆమె ఫ్యామిలీ దాడి

తీవ్ర గాయాలతో యువకుడి మృతి

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. బాలికతో ఫ్రెండ్ షిప్ చేస్తుండని, 18 ఏండ్ల యువకుడిని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కొట్టి చంపారు. ఢిల్లీ ఆదర్శ నగర్​లోని జహంగీర్ పురిలో నివసించే రాహుల్ బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడు చదువుకుంటూనే ట్యూషన్స్ చెబుతున్నాడు. ఈ క్రమంలో ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. అయితే వాళ్లిద్దరి ఫ్రెండ్ షిప్ బాలిక ఫ్యామిలీకి నచ్చలేదు. బాలిక అన్న, ఇతర కుటుంబసభ్యులు రాహుల్ పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు, ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం చనిపోయాడు. తీవ్రమైన గాయాలతోనే రాహుల్ చనిపోయాడని అటాప్సీ రిపోర్టులోనూ వెల్లడైంది. ‘‘ఈ నెల 7న రాహుల్ బజార్ లో బాలికతో కలిసి నడిచి వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆ టైమ్ లో అతణ్ని కొంతమంది వెంబడించారు. ఆ తర్వాత దాడి చేసి తీవ్రంగా కొట్టారు. గాయాలైన రాహుల్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు” అని పోలీసులు తెలిపారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో, బాలిక ఫ్యామిలీ వారి ఫ్రెండ్ షిష్ కు ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు. రాహుల్ పై 8 నుంచి 10 మంది దాడి చేశారని ఆయన తండ్రి ఆరోపించారు. అక్కడున్న కొంతమంది ఆపినప్పటికీ, వినకుండా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.10 లక్షల ఆర్థిక సాయం: సిసోడియా

ఈ ఘటనపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విచారం వ్యక్తంచేశారు. బాధిత ఫ్యామిలీకి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్య లు తీసుకుంటామన్నారు. ‘‘బాధితుడి ఫ్యామిలీ పల్లె నుంచి సిటీకి వచ్చింది. ఆ యువకుడు చదువుకుంటూ ట్యూషన్ చెబుతున్నాడు. ఇప్పుడా ఫ్యామిలీకి న్యాయం కావాలి. దీనికి కారణమైన వారిని తప్పకుండా శిక్షిస్తాం” అని సిసోడియా చెప్పారు.

For More News..

ఆస్తుల సర్వేకు గడువు10 రోజులు పెంచిన్రు