
- మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన
పాల్ఘర్: మహారాష్ట్రలో దారుణం జరిగింది. బాయ్‌ఫ్రెండ్ ను చెట్టుకు కట్టేసి ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. పాల్ఘర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక, ఆమె బాయ్ఫ్రెండ్ఈవెనింగ్వాకింగ్ చేస్తూ దగ్గర్లోని కొండపైకి వెళ్లారు. వారిని గమనించిన 22, 25 ఏండ్ల వయసున్న ఇద్దరు యువకులు కొండపైకి చేరుకొని వారిని బెదిరించారు. అనంతరం నిందితులకు, బాలుడికి మధ్య వాగ్వాదం జరగడంతో ఖాళీ బీరు బాటిళ్లతో ఇద్దరిని కొట్టారు. ఆ తర్వాత బాలుడి బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి.. బాలికను పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి పర్సును కూడా తగులబెట్టారు. అనంతరం బాలిక అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత పోలీసులు స్పాట్‌కు చేరుకొని బాలుడిని రక్షించారు. నిందితులు విరార్‌లోని సాయినాథ్ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించి అరెస్టు చేశారు. వారిపై గ్యాంగ్ రేప్ కేసు ఫైల్చేసి స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారిని మార్చి 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు.