
ఇప్పటి వరకు మీరు రెంటల్ బైక్స్ చూసుకుంటారు, రెంటల్ కార్లు, ఫర్నిఛర్, ఇళ్లు, ఇలా అద్దెకు వాడుకునే వస్తువుల గురించి వినే ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడుతున్నారా.. ఏం పర్లేదు, నన్ను రెంట్ కు తీసుకోండని కుర్రకారులకు ఆఫర్ బోర్డ్ పెట్టింది ఓ యువతి. సౌత్ ఢిల్లికి చెందిన దివ్య అనే యువతి సింగల్‌గా ఉన్న అబ్బాయిలకు అద్దె గర్ల్ ఫ్రెండ్ గా ఉంటానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నన్ను రెంట్‌కు తీసుకొని అమేజింగ్ మెమోరీస్ క్రియేట్ చేసుకోండి అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెనూ కార్డ్, రీల్స్ పోస్ట్ చేసింది. అందులో ఒక్కో డేట్ కు ఒక్కో రెంట్ ఉంది.
కాఫీ డేట్ కు రూ.1500, డిన్నర్ అండ్ మూవీ డేట్ కు రూ.2వేలు అంట, బైక్ రైడింగ్ కు రూ.4వేలు, కుక్కింగ్ టూ గెదర్ అయితే రూ.3500, షాపింగ్ కు రూ.4500 వీకెండ్ రెండు రోజులకు అయితే రూ.10వేలు తీసుకుంటానని ఓ కార్డ్ క్రియేట్ చేసింది.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 15వేల లైక్స్ తో ఈ రేట్ కార్డు పోస్ట్ ఇంటర్నెట్ లో అలా తిరుగుతా ఉంది. కొంతమంది నెటిజన్లు ఆ అమ్మాయిపై ఫుల్ సీరియస్ అవుతున్నారు. కామెంట్ల రూపంలో తన ఫీలింగ్స్ వ్యక్తపరుస్తున్నారు.