
హైదరాబాద్, వెలుగు : ఎల్బీ నగర్ పీఎస్ లో ఎస్టీ మహిళపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, రాచకొండ సీపీని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. ఎస్టీ మహిళపై పోలీసులు చేసిన దాడిని మీడియాలో చూసి తెలుసుకున్నానని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని గవర్నర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధిత మహిళ ఇంటికెళ్లి పరామర్శించి ఆమెను ఆదుకోవాలని రంగారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ బ్రాంచ్ నిర్వాహకులను గవర్నర్ ఆదేశించారు.