మెట్రోరైల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మెట్రోరైల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు : మెట్రో రైల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మినిమమ్ వేజెస్, మెట్రో పాస్​లు, లంచ్ బ్రేక్ ఇవ్వకుండా కార్మికులను ఇంబ్బంది పెడుతుండటంతో ఇప్పటికే ముగ్గురు సూసైడ్ చేసుకున్నారని బుధవారం ట్వీట్ చేశారు.

మెట్రో రైల్ వ్యవస్థనంతా రాష్ట్ర సర్కారు, ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టి.. దొరికినంత దోచుకోమని పర్మిషన్ కూడా ఇచ్చిందని ఆరోపించారు. రాష్ర్టంలోని కాంట్రాక్టర్లు, మత్య్సశాఖ అధికారులు కుమ్మక్కై  మత్య్సకారుల హక్కులను కాలరాస్తున్నారని ప్రవీణ్ మరో ట్వీట్ చేశారు. మెంబర్ షిప్ పేరుతో ఇన్సూరెన్స్, వెల్ఫేర్ స్కీమ్​లకు దూరం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.