ఒక్క వికెట్ కోల్పోకుండా ఊచకోత.. UAEపై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ

ఒక్క వికెట్ కోల్పోకుండా ఊచకోత.. UAEపై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ

చెన్నై: టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఒక్క వికెట్ నష్టపోకుండా యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఊదేసింది. టిమ్ సీఫర్ట్ 42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులతో  89 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఫిన్ అలెన్ 50 బంతుల్లో 5 సిక్సులు, 5 ఫోర్లతో 84 పరుగులు చేసి సత్తా చాటాడు. టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్.. ఇద్దరూ ఇద్దరే.. టీ20 వరల్డ్ కప్ 2026లో ఈ న్యూజిలాండ్ ఓపెనర్లు ఇద్దరూ యూఏఈ బౌలర్లపై సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించారు.

ఏ ఒక్క బౌలర్ను వదిలిపెట్టలేదు. బౌలర్లంతా బాధితులే.UAE బౌలర్ హైదర్ అలీ 4 ఓవర్లకు 27 పరుగులు ఇచ్చి పర్వాలేదనిపించాడు. మ్యాచ్ త్వరగా ఫినిష్ చేసి చెన్నైలో షాపింగ్ చేయాలనే తరహాలో న్యూజిలాండ్ బ్యాటర్లు మ్యాచ్ ముగించేశారు. ఈ మ్యాచ్లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో మహ్మద్ వసీం 66 పరుగులు, అలీషాన్ షరఫు 55 పరుగులతో రాణించారు.