చుక్కల భూముల సమస్యకు విముక్తి కల్పించాం : జగన్

 చుక్కల భూముల సమస్యకు విముక్తి కల్పించాం : జగన్

దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యకు  ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా విముక్తి పలికామని ఏపీ సీఎం జగన్ అన్నారు.  దీనివలన  రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం కల్పించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా  కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు.  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుదని నమ్మే ప్రభుత్వం తమదని  ఏపీ సీఎం జగన్ అన్నారు. రైతుల కష్టాలు తాను విన్నాను,చూశాను, ఉన్నానని చెప్పారు.  

నిషేదిత జాబితా నుంచి చుక్కల భూములను తొలిగించి రైతులకు చంద్రబాబు అన్యాయం చేశారని  జగన్  ఆరోపించారు. చంద్రబాబు రైతులను కోలుకోని దెబ్బ కొట్టారని అన్నారు.  చంద్రబాబు హయాంలో భూములు అమ్ముకునే పరిస్థితి లేదని కానీ ఇప్పుడు  చుక్కల భూముల హక్కుతో బ్యాంకు రుణాలు తీసుకోవచ్చునని జగన్ తెలిపారు.  

చంద్రబాబు,పవన్  లపై ఫైర్ 


రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు, పవన్ రైతు బాంధవుల వేషం వేసుకుని రోడ్డెక్కారని వి మర్శించారు.  చంద్రబాబు స్క్రీప్ట్ ప్రకారం పొలిటికల్ యాక్షన్ చేస్తూ..  ప్యాకేజీలు తీసుకునే ప్యాకేజీ స్టార్ మరోపక్కా అంటూ జగన్ విమర్శి్ంచారు.  వీరి డ్రామాలను ఎవరూ నమ్మోద్దని చెప్పారు.  సున్నా వడ్డీ పథకం రద్దు చేసి ఐదేళ్లలో రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.  వాళ్లకు ఓట్లు వేస్తే పేదలకు పథకాలు అందవన్నారు.  సూటు బూటు వేసుకున్న జోకర్లు సంక్షేమ పథకాలను తప్పుపడుతున్నారని విమర్శించారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు మంచి జరుగుతుందని జగన్ చెప్పారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కోనుగోలు చేస్తు్ందని అన్నారు.