80 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణం

80 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణం

రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్టు ఇస్తే.. కేసీఆర్ మాత్రం కేవలం 80 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ అని అంటున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ల్యాండ్ స్కేప్ గార్డెన్‎లో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు.. కేసీఆర్ ప్రకటనపై స్పందించారు. టెట్ వేయకుండా విద్యాశాఖలో ఖాళీలు ఎలా భర్తీ చేస్తారంటూ ప్రశ్నించారు. ఏండ్లుగా టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లు వేయకుండా సాగదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా యూనిఫాం పోస్టులకు కూడా వయోపరిమితి మూడేండ్లు పెంచాలని కోరారు. జాబ్ నోటిఫికేషన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు.