హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా ఆక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసుల తనిఖీలు, మెటల్ డిటెక్టర్లు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ సహా అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు, వ్యాపారవేత్తలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు డీజీలు, ఐదుగురు ఐజీలు, 10 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షించారు.
గ్లోబల సమ్మిట్ వేదికకు 25 కిమీ దూరంలోనే ఆరు చెక్ పోస్ట్‌లు పెట్టారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఫుట్ పెట్రోలింగ్ టీమ్స్, చుట్టుపక్కల గ్రామాల్లో ప్రత్యేక బృందాలను మోహరించారు. వేదిక వద్ద 115 నైట్-విజన్, పీటూజెడ్ కెమెరాలు, పది డ్రోన్ టీమ్స్‌తో మానిటరింగ్.. బైనాక్యులర్లు, నైట్ విజన్ కెమెరాలు, నాలుగు వాచ్ టవర్లతో నిఘా పెట్టారు.
