కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 231 పులులు
టైగర్ల సంఖ్యలో మధ్యప్రదేశ్ టాప్
70% పులులు ఇండియాలోనే..
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్ లో దేశంలోనే అత్యధికంగా 231 పులులు ఉన్నట్లు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2018 రిపోర్ట్ వెల్లడించింది. జూలై- 29న గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ 600 పేజీల రిపోర్ట్ ను విడుదల చేశారు. రిజర్వ్ ఫారెస్ట్లు, స్టేట్ ల వారీగా పులుల సంఖ్యను ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుంతం టైగర్ రిజర్వ్ లలో 1,923 పులులు ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. ఉత్తరాఖండ్ లోని కార్బెట్ రిజర్వ్ లో 231 పులులు ఉంటే, కర్నాటకలోని నాగరహొళెలో 127, బండిపురలో 126 పులులు ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. అస్సాంలోని కాజీరంగా, మధ్యప్రదేశ్ లోని బంధవ్ గఢ్ లో 104 చొప్పున పులులు ఉన్నట్లు పేర్కొంది. ఒడిశాలోని సిమిలిపాల్, తెలంగాణలోని అమ్రాబాద్, కవాల్, ఏపీలోని నాగార్జున సాగర్ శ్రీశైలం, జార్ఖండ్ లోని పలమూ, మధ్యప్రదేశ్ లోని సంజయ్ – డుబ్రి, అస్సాంలోని నమేరి, మానస్, వెస్ట్ బెంగాల్ లోని బక్సా, మిజోరంలోని డంపా,కర్నాటకలోని అంశి దాండేలి, అరుణాచల్ ప్రదేశ్ లోని పక్కెలో పులుల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పింది. పులుల జాడ లేని, తక్కువ సంఖ్యలో పులులు ఉన్న ప్రాంతాల్లోవాటిని సంరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది.
స్టేట్‌ల వారీగా మధ్యప్రదేశ్ టాప్
స్టేట్ వైజ్ గా పులుల సంఖ్యలో మధ్యప్రదేశ్ టాప్ లో ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. అక్కడ 526 పులులు ఉన్నట్లు తెలిపింది. 524 పులులతో కర్నాటక, 442 పులులతో ఉత్తరాఖండ్ తర్వాతి స్థానంలో నిలిచాయి. నాలుగేళ్లకోసారి నిర్వహించే టైగర్ సెన్సస్ పోర్నుట్ గతేడాది ప్రధాని మోడీ రిలీజ్ చేశారు. 2014లో 1,004 ఉన్న పులులు 2019 నాటికి 2,967కు పెరిగినట్లు అప్పటి రిపోర్ట్ పేర్కొంది.
70 శాతం పులులు ఇండియాలోనే: జవడేకర్
ప్రపంచంలోని 70% పులులు ఇండియాలో ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. ‘1973లో మన దగ్గర 9 టైగర్ రిజర్వ్ ఫారెస్టులు ఉండేవి. ప్రస్తుం వాటి సంఖ్య 50. అన్నీ గుడ్ లేదా బెస్ట్ గా ఉన్నాయి. పులుల సంరక్షణ కోసం ఇతర దేశాలతో కలిసి పనిచేస్తాం. 12 టైగర్ రేంజ్ కంట్రీస్ తో కలిసి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్, టైగర్ రిజర్వ్ ల నిర్వహణ కోసం పని చేసేందుకు సిద్ధం ‘ అని అన్నారు.


